త్వరలోనే బెంగళూరు పాలికేలకు ఎన్నికలు? | - | Sakshi
Sakshi News home page

త్వరలోనే బెంగళూరు పాలికేలకు ఎన్నికలు?

Jun 24 2026 8:28 AM | Updated on Jun 24 2026 8:28 AM

బనశంకరి: గ్రేటర్‌ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) పరిధిలోని ఐదు నగర పాలికేలకు ఆగష్టు 31 లోగా కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేపట్టింది. జూలై మొదటి లేదా రెండోవారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రకటించి ఆగష్టు 3వ వారంలో పోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. నోటిఫికేషన్‌ రాగానే నగరంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది.

చివరి గడువు

ఓటరు జాబితా తయారీ, ఇతరత్రా పనుల కోసమని ప్రభుత్వం, ఈసీ అనేకసార్లు గడువు పొడిగించాలని సుప్రీంను మొరపెట్టుకున్నాయి. ఇదే చివరి అవకాశమని స్పష్టంచేసిన కోర్టు, ఇకపై గడువు పొడిగించేది లేదని హెచ్చరించింది. సెప్టెంబరు ఆఖరు వరకు అవధి కోరగా తిరస్కరించింది. దీంతో ఈసీ ఓటర్ల తుది జాబితా రూపకల్పన, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది, ఇతరత్రా కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఇకపై అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, జేడీఎస్‌లు ఎన్నికల కోలాహలం ఆరంభం కానుంది.

జూలైలో నోటిఫికేషన్‌, ఆగస్టులో పోలింగ్‌

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈసీ చర్యలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement