కారు టైరు పేలి.. లారీని ఢీ | - | Sakshi
Sakshi News home page

కారు టైరు పేలి.. లారీని ఢీ

Jun 23 2026 1:28 AM | Updated on Jun 23 2026 1:28 AM

డ్రైవరు మృతి, బీఈఓలకు గాయాలు

దొడ్డబళ్లాపురం: ఐదుమంది విద్యాశాఖ అధికారులు ప్రయాణిస్తున్న కారు టైరు పేలి ప్రమాదం జరిగింది, ఇందులో కారు డ్రైవర్‌ చనిపోయాడు, ఈ సంఘటన చన్నపట్టణ తాలూకా ముదుగెరె వద్ద బెంగళూరు–మైసూరు హైవేలో జరిగింది. వివరాలు.. ఐదుమంది బీఈఓలు మైసూరు నుండి బెంగళూరుకు కారులో వెళ్తుండగా ఘటనాస్థలంలో టైరు పేలింది. అదుపుతప్పిన కారు హైవేలో పక్కరోడ్డులోకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. కారు డ్రైవర్‌ ఆనంద్‌ అక్కడే మృతిచెందాడు. బీఈఓలు మహేశ్‌, రేవణ్ణ, ప్రకాశ్‌, కృష్ణరాజు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు బయటకు తీసి సమీపంలోని చాముండేశ్వరి మెడికల్‌ కాలే జీ ఆస్పత్రిలో చేర్పించారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement