పెన్షన్‌ కోసం పండుటాకుల క్యూ | - | Sakshi
Sakshi News home page

పెన్షన్‌ కోసం పండుటాకుల క్యూ

Jun 23 2026 12:24 AM | Updated on Jun 23 2026 12:24 AM

బళ్లారిటౌన్‌: గత నాలుగు నెలల నుంచి వృద్ధులకు పెన్షన్లు రాకపోవడంతో మళ్లీ వెరిఫికేషన్‌ కోసం వృద్ధులు, రిజర్వేషన్‌ కలిగిన మహిళలు నగరంలోని నూతన జిల్లాధికారి కార్యాలయ భవనంలోని తాలూకా కార్యాలయంలో సోమవారం బారులు తీరారు. దాదాపు 100 మందికి పైగా ఒక్కసారిగా రావడంతో కార్యాలయం కిక్కిరిపోయింది. దరఖాస్తుల సమర్పణకు వృద్ధులు భారీగా వస్తున్నా కార్యాలయంలోని కౌంటర్‌ వద్ద కంప్యూటర్‌లో ఒక్కరే సిబ్బంది పని చేస్తుండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వృద్ధులు అక్కడే పడిగాపులు కాయాల్సి వచ్చింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement