వర్షాలు దూరమై.. ఖర్చులు భారమై.. | - | Sakshi
Sakshi News home page

వర్షాలు దూరమై.. ఖర్చులు భారమై..

Jun 23 2026 12:24 AM | Updated on Jun 23 2026 12:24 AM

హుబ్లీ: ధార్వాడ జిల్లాలో గత 20 రోజుల నుంచి వానలు పడక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హుబ్లీ తాలూకా బండివాడ గ్రామంలో సాగు పనుల్లో భాగంగా విత్తనం వేసిన రైతులు ప్రస్తుతం వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే నిరంతరం కరువు కాటకాలతో విత్తిన విత్తనం మొక్కగా మారక పోవడంతో నష్టాలతో బాధ పడుతున్నారు. సాగు పనుల కోసం ఎద్దులను కొనుగోలు చేయడం చాలా కష్టతరంగా మారింది. ఓ జత ఎద్దులకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పోనీ ట్రాక్టర్‌తో దుక్కి దున్ని సాగు చేద్దాం అంటే ప్రతి ఎకరాకు రూ.1500 నుంచి రూ. 2000 వరకు బాడుగ ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులకు డబ్బులు లేక వానలు కురవక రైతులు ఆర్థికంగా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఖరీఫ్‌ సీజన్‌ అదును దాటుతుందన్న కారణంతో కుటుంబ సభ్యులే దుక్కి దున్నడానికి ఎద్దులుగా మారి తమ పొలాన్ని దున్నుతున్నారు. వర్షాలు లేక పంట నాశనం కారాదని ఇలా చేస్తున్నారు. ప్రతి ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు.

ధార్వాడ జిల్లాలో

సేద్యానికి రైతన్నల పాట్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement