రాయచూరు రూరల్ : గంజాయి విక్రయం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ఆదివారం జిల్లాలోని సింధనూరు తాలూకా ఆర్.హెచ్.క్యాంప్‌లో హనుమేష్ సర్కార్(43), స్వాగత్ సర్కార్(34), మణిశంకర్ సర్కార్(37)లను పట్టుకుని, వారి నుంచి 5.210 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.5.12 లక్షలు ఉంటుందని అంచనా వేశామన్నారు. జిల్లాలో శాంతియుతంగా మొహర్రం ఆచరణకు గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని 1,561 మంది రౌడీషీటర్లకు పరేడ్ నిర్వహించామన్నారు. డీఎస్పీ శాంతవీర, సీఐ మహేష్ పాటిల్‌లున్నారు.


