యోగాతో ఆరోగ్య భాగ్యం | - | Sakshi
Sakshi News home page

యోగాతో ఆరోగ్య భాగ్యం

Jun 22 2026 1:36 AM | Updated on Jun 22 2026 1:36 AM

సాక్షి, బళ్లారి: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం బళ్లారి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. నగరంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆయుష్‌ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి చిన్నారులు, వృద్ధులు, మహిళలు, యువతీ యువకులు భారీగా తరలివచ్చారు. ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, వివిధ యోగాసనాలు వేస్తూ వాటి వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి తన స్వగృహం వద్ద యోగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగా ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి ఒక్కరూ మందుకు రావాలని సూచించారు. మన పూర్వీకులు కూడా యోగా, ధ్యానం వంటి ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల శారీరకంగా ఎంతో ధృడంగా ఉండేవారని తెలిపారు. నగరంలో పార్కులు, క్రీడా మైదానాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో యోగా సాధనపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్‌, జిల్లా ఎస్‌పీ సుమన్‌ పన్నేకర్‌, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సాక్షి, బళ్లారి: పూర్వకాలం నుంచి ప్రసిద్ధి చెందిన యోగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచానికి పరిచయం చేశారని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు గాలి లక్ష్మీ అరుణ పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రుక్మిణమ్మ చెంగారెడ్డి వృద్ధాశ్రమ ఆవరణలో చెంగారెడ్డి మానసిక దివ్యాంగుల విశేష పాఠశాలలో యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మానసిక దివ్యాంగులతో కలసి యోగా చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ సుబ్బారెడ్డి, గురుమూర్తి, యోగా గురువులు మీనాక్షి, సరోజిని తదితరులు పాల్గొన్నారు.

రాయచూరు రూరల్‌: ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం చేయాలని కలబుర్గి డివిజన్‌ సమాచార కమిషనర్‌ వెంకటసింగ్‌ సూచించారు. ఆదివారం మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ అరుణాంగ్శు గిరి, ఏసీ హంపణ్ణ, జిల్లా ఆయుష్‌ అధికారి శంకర గౌడ పాటిల్‌, విద్యాశాఖ అధికారులు మల్లికార్జున, ఈరణ్ణ, కృష్ణ, వీరేష్‌ నాయక్‌, సునీత, స్మిత, పూజా, తిమ్మప్ప పాల్గొన్నారు.

ఆరోగ్యమే నిజమైన సంపద

హొసపేటె: నేటి ఆధునిక యుగంలో ఒక వ్యక్తి ఎంత సంపద, డబ్బు సంపాదించినా వృద్ధాప్యంలో అండగా నిలిచేది ఆరోగ్యమే. యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని అదనపు జిల్లా మెజిస్ట్రేట్‌ బాలకృష్ణ సూచించారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆయుష్‌ శాఖ, పురపాలక మండలి, వివిధ ప్రముఖ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఎన్‌.రూపేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు.. అది మన జీవితంలో ఒక భాగం కావాలని సూచించారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనే విషయం మరచి పోకూడదన్నారు. అనంతరం యోగా గురువు బాలచంద్ర శర్మ యోగా శిక్షణ ఇచ్చారు. 2000 మందికి పైగా యోగా ఔత్సాహికులు, యోగా సాధకులు, సాధారణ ప్రజలు యోగాసనాలు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. కార్యక్రమంలో అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ మంజునాథ్‌, ఆయుష్‌ డాక్టర్‌ కె.హెచ్‌ గురుసవరాజ్‌, డాక్టర్‌ ముని వాసుదేవ రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఎరగుడి శివకుమార్‌, డీపీఐ రామచంద్ర, బీఈఓ ఉమాపతి, ఫిజికల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ అశ్విన్‌ కొతంబరి, మానస బ్రహ్మకుమారి అసోసియేషన్‌ జిల్లా స్థాయి అధికారులు కాసట్టి ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

పార్కులు, క్రీడా మైదానాలు,

విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో యోగా సాధన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement