బళ్లారిలో నీట్‌ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

బళ్లారిలో నీట్‌ పరీక్ష

Jun 22 2026 1:36 AM | Updated on Jun 22 2026 1:36 AM

సాక్షి, బళ్లారి: నీట్‌–యూజీ 2026 పరీక్ష ఆదివారం విజయవంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:15 గంటల వరకూ పరీక్ష జరిగింది. నగరంలోని సతీష్‌ చంద్ర అగర్వాల్‌ సరళాదేవి కళాశాలతో సహా 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలో 4,127 మంది నీట్‌ యూజీ పరీక్ష రాయడానికి రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 692 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. గతంలో నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ అయిన విషయం తెలిసిందే. ఈసారి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. సీసీటీవీ పర్యవేక్షణ, బయోమెట్రిక్‌ ధ్రువీకరణ మధ్య నీట్‌ పరీక్షలు నిర్వహించారు.

రాయచూరు రూరల్‌: జిల్లాలోని 12 కేంద్రాల్లో 3,979 మంది విద్యార్థులు నీట్‌ పరీక్షకు హాజరయ్యారు. రాయచూరు నగరంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి సందర్శించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement