సాక్షి, బళ్లారి: నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డి బర్త్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆయా కాలనీల్లో కేక్‌లు కట్ చేశారు. అన్నదాన శిబిరాలు నిర్వహించి అభిమానం చాటుకున్నారు. గాలి సోమశేఖర రెడ్డి నగరంలోని శ్రీకోట మల్లేశ్వర స్వామి ఆలయం, కనక దుర్గమ్మ ఆలయం, బాలంజనేయ స్వామి ఆలయం, నగరేశ్వర, కాశీవిశ్వేశ్వర ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తల్లిదండ్రులు రుక్మిణమ్మ, చెంగారెడ్డి సమాధులను దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు గాలి సోమశేఖర రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో గాలి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ.. అఽధికారంలో ఉన్నా, లేకున్నా తనపై జనం చూపుతున్న అభిమానాన్ని ఎన్నటికీ మరవలేనిదన్నారు. నగర వార్డు కౌన్సిలర్ నుంచి ఉప మేయర్, మేయర్, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నగర ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


