నటి చిత్రాల మార్ఫింగ్‌.. కిలాడీల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

నటి చిత్రాల మార్ఫింగ్‌.. కిలాడీల అరెస్టు

Jun 21 2026 12:19 AM | Updated on Jun 21 2026 12:19 AM

శివాజీనగర: ఏఐ, డీప్‌ఫేక్‌ ద్వారా ప్రముఖ నటి రుక్మిణి వసంత్‌ అశ్లీల చిత్రాలను రూపొందించి వ్యాప్తి చేసిన కేసులో నిందితులు బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేసి విచారించగా సంచలన అంశాలు బయటపడ్డాయి. వ్యూస్‌, వికృతానందం కోసం నటీమణుల నగ్న, అర్దనగ్న చిత్రాలను రూపొందించినట్లు తెలిపారు.

ఎవరెవరు?

ఐటీ సిటీలో నివసిస్తున్న బాగకోటకు చెందిన రవికుమార్‌ (24), శివమొగ్గ జిల్లావాసి, టెక్కీ రంజిత్‌ కుమార్‌ (25), బెంగళూరువాసి చంద్రకాంత్‌ (33) నిందితులు. రవికుమార్‌ బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసి యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్నాడు. ఇటీవల యూట్యుబ్‌ ద్వారా తొలి సంపాదన పొందిన ఇతనికి మరింత సొమ్ము సంపాదించే ఆశ పుట్టింది. అప్పటి నుంచి వ్యూస్‌ని పెంచుకునేందుకు నటిల డీప్‌ఫేక్‌ వీడియోలను తయారు చేసి చేసి అప్లోడ్‌ చేయసాగాడు. రెండో నిందితుడు, ఐటీ ఇంజనీరు రంజిత్‌కుమార్‌కు ఏడాదికి రూ.20 లక్షల ప్యాకేజీతో ఉద్యోగముంది. ప్రముఖ నటీమణుల ఏఐ, డీప్‌ఫేక్‌ అశ్లీల వీడియోలను తయారు చేస్తున్నట్లు విచారణలో చెప్పాడు.

మరో నిందితుడు చంద్రకాంత్‌ ఇతను బెంగళూరులో ప్రముఖ చార్టర్డ్‌ అంకౌంటెంట్‌ కంపెనీలో పని చేస్తుండేవాడు. మంచి జీతం లభిస్తోంది. కానీ వికృతానందం కోసం నటీమణుల ఫోటోలను డీప్‌ఫేక్‌ చేస్తున్నట్లు తెలిపాడు. వారి నుంచి 3 హైటెక్‌ మొబైల్‌ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏఐ యాప్‌లు, సాఫ్ట్‌వేర్‌లను వినియోగించి నగ్న, అర్ధనగ్న శరీరాలకు కోరుకున్న నటీమణుల ముఖాలను పేస్ట్‌ చేసి చిత్రాలను తయారు చేసేవారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు.

నటి రుక్మిణి వసంత్‌ అశ్లీల చిత్రాలు..

బెంగళూరులో టెక్కీ, యూట్యూబర్‌, ప్రైవేటు ఉద్యోగి అరెస్టు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement