బనశంకరి: గ్యారంటీ పథకాల్లో గృహలక్ష్మీ, గృహజ్యోతి లబ్ధిదారుల పునఃపరిశీలనకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అనర్హులను గుర్తించి దుర్వినియోగానికి అరికట్టడానికి అధికారులు ఇంటింటికెళ్లి కేవైసీ, సర్వే చేయాలని ప్రభుత్వం తీర్మానించింది. లబ్ధిదారుతో మాట్లాడడం, ఆధార్, ఓటరు, రేషన్ కార్డుల వివరాలను తప్పనిసరిగా తీసుకుంటారు. బయటి రాష్ట్రాలవారు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులతో పాటు అనర్హులు లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు రావడంతో సర్కారు ఏరివేతకు సై అంది. కాగా, గృహలక్ష్మీ డబ్బులను అప్పుల వసూళ్లకు కట్ చేయరాదని బ్యాంకులను ఆదేశించారు. 1.65 కోట్ల మంది మహిళలకు ఈ డబ్బు జమవుతోంది. అలాగే ఇతర గ్యారంటీ పథకాల అనర్హులను గుర్తించి తొలగిస్తారు.


