శరణతత్వ ఆచారాలను నేర్పాలి | - | Sakshi
Sakshi News home page

శరణతత్వ ఆచారాలను నేర్పాలి

Jun 21 2026 12:19 AM | Updated on Jun 21 2026 12:19 AM

రాయచూరు రూరల్‌: నేటి ఆధునిక సమాజంలో పిల్లలు దారి మళ్లుతున్నారని, అలాంటి వారికి శరణుల గురించి వారి తత్వాలను, ఆచార, విచారాలను, సంస్కృతి పట్ల విద్యార్థులకు నేర్పాలని బెంగళూరు మహారాణి క్లస్టర్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఆశాదేవి పిలుపునిచ్చారు. శనివారం పండిత ిసిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో అఖిల భారత శరణ సాహిత్య పరిషత్‌ మైసూరు, రాయచూరు ఆధ్వర్యంలో శరణ సాహిత్య పరిషత్‌, కదళి మహిళా వేదిక ప్రథమ సమ్మేళనాన్ని ప్రారంభించి ప్రసంగించారు. 12వ శతాబ్ధంలో 720 వచనాలను పలికిన బసవణ్ణను ఆదర్శంగా తీసుకుని వచనాల ద్వారా విద్యార్థులు, యువకుల్లో మార్పులు తేవాలన్నారు. పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు జీవిత విలువలను గురించి వివరించాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకొస్తున్న తరుణంలో కదళి వేదిక చేపట్టిన సమ్మేళనం సాక్షిగా పేర్కొన్నారు. కార్యక్రమంలో శరణ సాహితీవేత్తలు గంగమ్మ, సుశీల, లలిత, హంపణ్ణ, శరణమ్మ, నాగరాజ్‌ మస్కి, దానమ్మ, సుమంగళ, రేఖ, పార్వతి, అధికారి ఉత్తరాదేవి మఠపతి, అంబాపతి పాటిల్‌లున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement