యోగా దినోత్సవంపై బైక్‌ జాగృతి ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

యోగా దినోత్సవంపై బైక్‌ జాగృతి ర్యాలీ

Jun 21 2026 12:19 AM | Updated on Jun 21 2026 12:19 AM

హొసపేటె: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా ఆయుష్‌ శాఖ, జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, పతంజలి యోగా సమితి, ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, కన్నడ విశ్వవిద్యాలయం, ఏఎఫ్‌ఐ వంటి జిల్లాలోని వివిధ విభాగాలు, సంస్థల సహకారంతో శుక్రవారం నిర్వహించిన భారీ బైక్‌ జాగృతి ర్యాలీని అదనపు డిప్యూటీ కమిషనర్‌ ఈ.బాలకృష్ణ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. యోగా ప్రాముఖ్యతను తెయజేసే నినాదాలు, పోస్టర్లను ప్రదర్శిస్తూ ఈ భారీ బైక్‌ ర్యాలీ ఫ్రీడం పార్క్‌ నుంచి ప్రారంభమై బస్టాండ్‌, మూరంగడి సర్కిల్‌, మీర్‌ ఆలం టాకీస్‌, బస్‌ డిపో, వడకరాయన రోడ్డు, మెయిన్‌ బజార్‌, పాదగట్టె ఆంజనేయ దేవాలయం, రామా టాకీస్‌, వాల్మీకి సర్కిల్‌, మార్కండేశ్వర దేవాలయం, 100 పడకల ఆస్పత్రి రోడ్డు, విజయనగర కళాశాల, అంబేడ్కర్‌ సర్కిల్‌, షాన్‌బాగ్‌ సర్కిల్‌ వంటి నగరంలోని ప్రధాన రహదారుల గుండా ప్రయాణించి, తిరిగి ఫ్రీడం పార్క్‌కు చేరుకుని ముగిసింది. ఆయుష్‌ శాఖ అధికారి డాక్టర్‌ కేహెచ్‌.గురుబసవరాజ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement