● రీ కౌంటింగ్‌లో మళ్లీ గెలుపు
శివాజీనగర: చిక్కమగళూరు జిల్లా శృంగేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే టీ.డీ.రాజేగౌడనే రెండోసారి గెలిచారు. ఉద్యోగుల ఓట్ల రీకౌంటింగ్‌లో ఇది సాధ్యమైంది. వివరాలు.. 2023 ఎన్నికల్లో రాజేగౌడ 201 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. అయితే పోస్టల్ ఓట్ల లెక్కింపులో అక్రమం జరిగిందని ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి డీ.ఎన్.జీవరాజ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పోస్టల్ ఓట్ల రీ కౌంటింగ్‌కు కోర్టు ఆదేశించింది. అదే ప్రకారంగా శనివారం స్థానిక ఐడీఎస్‌జీ కాలేజీలో పోస్టల్ ఓట్లను తిరిగి లెక్కించారు. అయితే ఈసారి 2 ఓట్లు అదనంగా రావడంతో రాజేగౌడ 203 ఓట్ల ఆధిక్యంతో గెలిచినట్లయింది. జీవరాజ్‌కు మరోసారి పరాభవం తప్పలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం బయట చిందులు వేస్తూ టపాసులు పేల్చి సంబరాలు చేసుకొన్నారు. ప్రజా తీర్పును ఎవరూ మార్చలేరని నినాదాలు చేశారు.


