యశవంతపుర: భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు ఆర్‌టీనగరలో చోటు చేసుకోంది. బెంగళూరు ఆర్‌టీనగర డేవిడ్, సువిమిత్ర దంపతులు నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం సుమిత్ర తల్లిదండ్రులు ఫోన్ చేశారు. ఎంతసేపటికీ ఆమె ఫోన్ ఎత్తలేదు. ఇంటి వద్దకు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించింది. బెడ్ రూంలో డేవిడ్ ఉరికి వేలాడుతున్నాడు. ఆర్‌టీ నగర పోలీసులు వచ్చి పరిశీలించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. సుమిత్ర చేతిపై బరికిన ఆనవాళ్లు ఉన్నాయి. భార్యను గొంతు పిసికి హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


