బనశంకరి: కెమెరా చిన్నదే కానీ.. జీవితాన్ని ప్రతిబింబిస్తుంది, జీవితంలో సుఖదుఃఖాల గుర్తులను నిలిపేది అదే. కెమెరా కొత్త ఊహల్లోకి తీసుకెళ్తుంది. అలాంటి ఛాయాచిత్ర ప్రేమికులకు తీయని వార్త. బెంగళూరులోని యూత్ ఫొటోగ్రఫిక్ సొసైటీ సలాన్–2026 పేరుతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ప్రదర్శనకు 38 దేశాల నుంచి 311 మంది ఛాయాచిత్రగ్రాహకులు 3,489 ఫొటోలను పంపించారు. వాటిలో 946 ఉత్తమ ఛాయాచిత్రాలను తుది విడతకు ఎంపికచేసి, నాలుగు విభాగాల్లో 85 అత్యుత్తమ ఛాయాచిత్రాలకు బహుమతులను అందిస్తామని వైపీఎస్ ప్రతినిధులు అనితా మైసూరు, గిరీశ్ అనంతమూర్తి, ప్రేమా కాకడే, హార్థిక్, వీ.మంజువికాస్‌శాస్త్రి తెలిపారు. గురువారం బెంగళూరులో కొన్ని ఉత్తమ ఛాయాచిత్రాలను ప్రదర్శించారు. పోలెండ్, బెంగళూరు, సింగపూర్ ప్రాంతాలకు చెందిన పోటీదారుల చిత్రాలు ఇందులో ఉన్నాయి. విజేతల ఛాయాచిత్రాలను శని, ఆదివారాల్లో చిత్రకళాపరిషత్‌లో ప్రదర్శిస్తామని తెలిపారు.
25, 26న చిత్రకళా పరిషత్‌లో ఛాయాచిత్ర ప్రదర్శన


