భార్యను చంపి, భర్త ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

భార్యను చంపి, భర్త ఆత్మహత్య

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

కెలమంగలం: ఉద్దనపల్లి సమీపంలో విషాద సంఘటన జరిగింది. భార్యను హత్య చేసిన భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. వివరాలు... తిరుపత్తూరుకు చెందిన సురేష్‌ (31), ఉద్దనపల్లి సమీపంలోని దొడ్డమెట్రెవాసి కావ్య (25)తో ఐదేళ్ల కిందట పెళ్లి జరిగింది. ఈ దంపతులకు కూతురుంది. భార్యాభర్తలిరువురూ దొడ్డమెట్రిలో అక్కడే వేర్వేరు పరిశ్రమల్లో పనిచేసేవారు. అయితే తరచుగా గొడవలు పడేవారు. మంగళవారం రాత్రి కూడా కొట్లాట జరిగింది, సురేష్‌ కత్తితో భార్యను హత్య చేసి, ఆపై ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. బుధవారం ఉదయం సురేష్‌ ఇంటికెళ్లిన బంధువులకు ఇరువురూ శవాలుగా కనిపించడంతో ఉద్దనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. తల్లిదండ్రుల మృతితో పాప అనాథగా మారింది. ఈ దుర్ఘటన గ్రామంలో తీవ్ర విషాదం మిగిల్చింది.

భర్త సురేష్‌ (ఫైల్‌)

భార్య కావ్య (ఫైల్‌)

క్రిష్ణగిరి జిల్లాలో విషాదం

Advertisement
 
Advertisement
Advertisement