సంస్కృతికి నిలయం భారతదేశం | - | Sakshi
Sakshi News home page

సంస్కృతికి నిలయం భారతదేశం

Feb 18 2026 7:04 AM | Updated on Feb 18 2026 7:04 AM

సంస్క

సంస్కృతికి నిలయం భారతదేశం

రాయచూరు రూరల్‌: ఆధ్యాత్మిక, సంస్కృతి, ఆచార, సంప్రదాయాలకు భారతదేశం నిలయమని అసిస్టెంట్‌ కమిషనర్‌ హంపణ్ణ పేర్కొన్నారు. సోమవారం రాత్రి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. భారతదేశంలో సర్వధర్మ సమన్వయంతో అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మనందరిదన్నారు. బ్రహ్మకుమారి విద్యాలయం సంచాలకురాలు స్మిత మాట్లాడుతూ అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేందుకు సత్యజ్ఞానాన్ని అందించేందుకు శివుడు ప్రత్యక్షమవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దండెప్ప బిరాదార్‌, శారద, ఏఎస్పీ కుమారస్వామి, కృష్ణ, రమేష్‌, ప్రేమానంద, ప్రభురాజ్‌, గురునాథ్‌లున్నారు.

టీబీ డ్యాంకు ఐదు గేట్ల అమరిక పూర్తి

హొసపేటె: తుంగభద్ర డ్యాంలో 32, 33వ నంబరు పాత క్రస్ట్‌గేట్లను తొలగించి కొత్త క్రస్ట్‌గేట్లను ఏర్పాటు చేశారు. ఇంతవరకు మొత్తం ఐదు గేట్లు ఏర్పాటు చేసినట్లు తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు. 2, 4, 11, 17, 24, 26, 27, 28తో కలిపి మొత్తం 8 గేట్ల అమరిక పనులు పురోగతిలో ఉన్నాయి. మొత్తం 23 గేట్ల నిర్మాణ పనులు కూడా పూర్తయినట్లు వారు తెలిపారు. గదగ్‌, హొసపేటెలో ఒక్కొక్క గేటు నిర్మించారు. పాత 15 గేట్లను తొలగించే పని పూర్తయింది. మరో 5 గేట్లను కత్తిరించి తొలగిస్తారని ఆయన వివరించారు.

యథేచ్ఛగా మట్టి తరలింపు

హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని బ్యాలాళు గ్రామ శివార్లలో జేసీబీ ఉపయోగించి అక్రమంగా, యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నట్లు గ్రామస్తులు టోల్‌ ఫ్రీ నంబర్‌–112కు ఫిర్యాదు చేశారు. పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని టిప్పర్‌, జేసీబీని జప్తు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీనిపై కరవే నాయకుడు, గ్రామస్తుడు విజ్ఞాననాథ భక్రియాండి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇసుక, కంకర, మట్టి అక్రమంగా తరలిస్తున్నారన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై ఎస్‌ఐ బసవరాజ్‌ మాట్లాడుతూ ఈ విషయంపై ఉన్నతాధికారుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ చెరువు అభివృద్ధి సమితి అధ్యక్షుడు ఎం.నింగప్ప, జాలిహాళ్‌ హులుగప్ప, ఎం.మల్లికార్జున, జీ.రామప్ప, జీఎం కరిబసయ్య సహా గ్రామ నాయకులు పాల్గొన్నారు.

కార్యవర్గం ఎంపిక

బళ్లారిఅర్బన్‌: బళ్లారి పన్ను సలహాదారుల సంఘం నూతన కార్యవర్గం ఎంపిక ఫిబ్రవరి 13న శాంతియుతంగా జరిగింది. సంఘ సభ్యుల సమక్షంలో నిర్వహించిన ఎన్నికల్లో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. గౌరవాధ్యక్షుడుగా యశ్వంత్‌రాజ్‌ నాగిరెడ్డి, కార్యాధ్యక్షుడుగా ఎస్‌.ఉస్మాన్‌ షరీఫ్‌, ఉపాధ్యక్షుడుగా హరీష్‌ పార్థసారథి, గౌరవ కార్యదర్శిగా పీ.శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శిగా పాండురంగ విట్టల్‌, కోశాధికారిగా ఎన్‌.అశ్విని ఎంపికయ్యారు. సంఘం అభివృద్ధి, పన్ను వృత్తిదారుల హితసాధన, వృత్తిపర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని నూతన పదాధికారులు తెలిపారు. పన్ను సలహాదారుల ఐక్యత, వృత్తి నైతికత, సభ్యుల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తామన్నారు. నూతన కార్యవర్గాన్ని సంఘం సభ్యులు అభినందించారు.

మౌలిక సౌకర్యాలు ప్రజల హక్కు

రాయచూరు రూరల్‌: దేశ ప్రజలు రాజ్యాంగబద్ధంగా మౌలిక సౌకర్యాలు పొందడం హక్కుగా భావించాలని జిల్లా అదనపు న్యాయమూర్తి ఎం.గుల్జార్‌ లాల్‌ పిలుపు ఇచ్చారు. జిల్లా ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా హక్కులను అనుభవించడంతో పాటు విధి నిర్వహణలో కూడా శ్రద్ధ కనబరచాలన్నారు. ప్రజలకు జిల్లా న్యాయ సేవ ప్రాధికార నుంచి ఉచిత న్యాయ సలహాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తి స్వాతిక్‌, శ్రీకాంత్‌, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు, నోడల్‌ అధికారి గణేష్‌, విజయ్‌ శంకర్‌, నందిత, మనోహర్‌ పత్తార్‌, వెంకటేష్‌, ఈశ్వర్‌లున్నారు.

సంస్కృతికి నిలయం భారతదేశం1
1/3

సంస్కృతికి నిలయం భారతదేశం

సంస్కృతికి నిలయం భారతదేశం2
2/3

సంస్కృతికి నిలయం భారతదేశం

సంస్కృతికి నిలయం భారతదేశం3
3/3

సంస్కృతికి నిలయం భారతదేశం

Advertisement
 
Advertisement
Advertisement