ఘనంగా ఆండాళ్ రంగమన్నార్ తిరుకళ్యాణోత్సవం
తుమకూరు: నగరంలోని శ్రీవైష్ణవ సమాజ్ ఆడిటోరియంలో తుమకూరు జిల్లా శ్రీవైష్ణవ కమ్యూనిటీ అసోసియేషన్, ఆండాళ్ గోష్టి ఆధ్వర్యంలో ఆండాళ్ రంగమన్నార్ తిరుకల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధార్మిక ఆచారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాజ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తుమకూరు నగర ఎమ్మెల్యే జి.బి. జ్యోతిగణేష్ మాట్లాడుతూ భక్తి, ధర్మానికి ప్రసిద్ధి చెందిన శ్రీవైష్ణవ సమాజం సంఘటితమై అభివృద్ధి చెందాలన్నారు. మాజీ ఎమ్మెల్యే హెచ్.నింగప్ప పూజలు చేశారు. జిల్లా శ్రీవైష్ణవ సంఘం ధార్మిక సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికై న టి.ఎస్.మోహన్‌కుమార్, గౌరవాధ్యక్షుడు నందగోపాల్, ఉపాధ్యక్షుడు నవరత్నకుమార్, కార్యదర్శి యోగానంద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్, కోశాధికారి భక్తవత్సల పాల్గొన్నారు.


