యువకుల వేషాల్లో వచ్చి చోరీలు
యశవంతపుర: ఇద్దరు యువతులు యువకుల వేషాలు వేసి చోరీలకు పాల్పడుతుండగా బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సంపిగేహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలోని ట్యానరి రోడ్డుకు చెందిన శాలు, నీలు అనే యువతులు ఫ్యాంట్, షర్ట్, టోపిని ధరించి పగటి పూట బైకుల్లో తిరుగుతారు. తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రిళ్లు చోరీల పాల్పడేవారు. ఈ నెల 13న సంపిగేహళ్లికి చెందిన సంగమేశ్ ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. సీసీ కేమరాలను పరిశీలించగా ఇద్దరు యువకులు నడిచి వెళ్లతున్న దృశ్యాలను గుర్తించారు. అదుపులోకి తీసుకోని విచారించగా యువతులుగా బయట పడింది.
బోటింగ్ చేస్తూ మహిళ మృతి
దొడ్డబళ్లాపురం: ప్రసిద్ధ పర్యాటక స్థలం గోకర్ణకు వచ్చిన మహిళ బోటింగ్ చేస్తూ మృతిచెందింది. బెంగళూరుకు చెందిన నాగరతినమ్(58) తన కుటుంబ సభ్యులతో కలిసి గోకర్ణకు వచ్చింది. ప్యారడైజ్ బీచ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి బోటింగ్ వెళ్లింది. బోట్ సముద్రంలో వెళ్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ మార్గం మధ్యలోనే మృతిచెందింది. గుండెపోటు వల్ల మృతిచెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.గోకర్ణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
సైలెన్సర్‌లో మార్పు..
రూ.లక్ష జరిమానా
యశవంతపుర: శబ్దం ఎక్కువగా వచ్చేలా కారు సైలెన్సర్‌లో మార్పులు చేసిన వ్యక్తికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు రూ.1.11 లక్షల జరిమానా విధించారు. బెంగళూరు హెణ్ణూరుకు చెందిన వ్యక్తికి చెందిన కారు పెద్ద శబ్దంతో వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకొని పరిశీలించగా సైలెన్సర్‌లో మార్పు చేసినట్లు గుర్తించి రూ.1.11 లక్షలు జరిమానా విధించి వాహనాన్ని సీజ్ చేశారు. కారుపై గతంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉండటంతో వాటికి జరిమానా విధించారు.
యువకుల వేషాల్లో వచ్చి చోరీలు


