లాల్ బాగ్‌లో ఆకట్టుకున్న ప్రదర్శన
బొమ్మనహళ్లి: నందికొండలో యోగనందీశ్వరాలయ ప్రధాన అర్చకుడు టీ.ఎన్.నాగరాజు తమ కొండల్లో లభించిన ఎండిన చెట్టు వేర్ల నుంచి అనేక కళాఖండాలను తయారు చేశారు. వివిధ రకాల కళాఖండాలను బెంగళూరులోని లాల్‌బాగ్‌లో నిర్వహిస్తున్న ఫ్లవర్ షోలో ప్రదర్శిస్తున్నారు. సుమారు 500 కళాఖండాలు ఇక్కడి లాల్‌బాగ్‌కు వచ్చిన పర్యాటకులను ఆకటుకుంటున్నాయి. కళాఖండాలతో పాటు ఆయన సేకరించిన వివిధ దేశాలకు నాణేలు, నోట్లను ప్రదర్శనలో ఉంచారు. ఈ నెల 26 వరకు జరుగనున్న ఈ ప్రదర్శనలో ఇప్పటికే వీక్షకుల నుంచి విశేష స్పందన వస్తున్నట్లు నాగరాజు తెలిపారు. సుమారు 2 వేల నాణేలను ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. వీటిలో 110 సంవత్సరాల పాత నాణేలు, నోట్లు, బంగారు, వెండి, ఇత్తడి, రాగి నాణేలు, చోళులు, జార్జ్ ఎడ్వర్డ్, ఈస్ట్ ఇండియా కంపెనీ, విక్టోరియా మహారాణి, రష్యా దేశ నాణేలు సైతం ఉన్నాయి.
చెట్ల వేర్లతో తయారైన కళాఖండాలు, ప్రాచీన నాణేలు, కరెన్సీ నోట్లు
లాల్ బాగ్‌లో ఆకట్టుకున్న ప్రదర్శన


