అక్రమ వలసదారుల షెడ్‌లో పేలిన సిలిండర్
బొమ్మనహళ్లి : బెంగళూరు శివార్లలోని బేగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలెనహళ్లిలో బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు నివసిస్తున్న షెడ్లలో సిలిండర్ పేలుడు సంభవించింది. గృహోపకరణాలు, దుస్తులు కాలిపోయాయి. ఐదు ఎకరాల్లో బంగ్లాదేశ్ వలసదారులు షెడ్లు వేసుకొని నివసిస్తున్నారు. ప్లాస్టిక్ తదితర వాటిని సేకరించి కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇటీవల కొంతమంది అక్రమ వలసదారులను అక్కడినుంచి ఖాళీ చేయించారు. అయినా మళ్లీ వచ్చి షెడ్లలో ఉంటన్నారు. ఈక్రమంలో శుక్రవారం వేకువజామున 3గంటల సమయంలో ఒక షెడ్‌లోని సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. నిద్రలో ఉన్న అక్రమ వలసదారులు మేల్కొని షెడ్లనుంచి బయటకు వచ్చి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. జయనగర్, హులిమావు, ఎలక్ట్రానిక్ సిటీ మరియు అంజనపుర నుండి అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక చర్యలో పాల్గొని మంటలు అదుపు చేశారు. జయనగర్, హులిమావు, ఎలక్ట్రానిక్ సిటీ, అంజనపుర నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. అప్పటికే షెడ్లలోని వస్తు సామగ్రి, టీవీలు ఫ్రిజ్‌లు, ఇతర సామగ్రి కాలి బూడిందైనట్లు జిల్లా అగ్నిమాపక అధికారి మంజునాథ్ తెలిపారు.


