సుడిగాలికి ఎగిరిపోయిన భారీ పెండాల్
● మంత్రి సతీష్ జార్కిహోళికి తప్పిన ప్రమాదం
దొడ్డబళ్లాపురం: భారీ పెండాల్ సుడిగాలికి ఎగిరిపోయిన సంఘటనలో మంత్రి సతీష్ జార్కిహోళి తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. హావేరి జిల్లా రాణెబెన్నూరు పట్టణంలో శనివారం ఈ సంగటన జరిగింది. పట్టణంలో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం నిమిత్తం భారీ పెండాల్ ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముగిసాక పెండాల్ కింద మంత్రి సతీష్ జార్కిహోళి మీడియాతో మాట్లాడుతుండగా సుడిగాలి వచ్చింది. దీంతో భారీ పెండాల్ ఎగిరి మంత్రి పక్కనే పడింది. దీంతో మంత్రికి ప్రమాదం తప్పింది.
సీఎంతో ఎమ్మెల్యే భేటీ
సాక్షి, బళ్లారి: రాయచూరు జిల్లాలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య శనివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని బెంగళూరు వెళుతూ తోరణగల్లు వద్ద ఉన్న జిందాల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈక్రమంలో బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ సీఎంను కలిశారు. బళ్లారిలో చోటు చేసుకున్న ఘర్షణలు, కార్యకర్త మృతి, ప్రస్తుతం బళ్లారిలో నెలకొన్న వాతావరణం గురించి వివరించినట్లు సమాచారం.


