
నైపుణ్యాధారిత విద్యకు శిక్షణ దోహదం
హొసపేటె: పిల్లల్లో నైపుణ్య ఆధారిత విద్యకు స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ సహాయకారిగా ఉంటుందని స్కాట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి పీ.మంజునాథ్ అభిప్రాయపడ్డారు. శనివారం నగరంలోని సప్తగిరి ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో ఏర్పాటు చేసిన నూతన స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ పిల్లల్లో క్రమశిక్షణ, నైపుణ్యాలు, జ్ఞానం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు ప్రత్యేక శిక్షణ సెషన్లలో ప్రథమ చికిత్స ఎలా అందించాలో ఈ యూనిట్ వారికి నేర్పుతుందని ఆయన అన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ మధుజైన్ మాట్లాడుతూ తమ పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభించినందుకు పిల్లలు సంతోషంగా ఉన్నారు. పాఠ్యేతర కార్యకలాపాలు పిల్లలకు మరింత ప్రభావంతమైన విద్యను అందిస్తాయన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ఆర్గనైజర్ జీబీసీ పాటిల్, పాఠశాల నిర్వాహకురాలు ఎస్‌జీ సతీష్, స్కౌట్స్ మాస్టర్ శ్రీనివాస్, జీ.జోషి, గైడ్స్ కెప్టెన్ కనకలక్ష్మి, జిల్లా అభివృద్ధి నిర్వాహకురాలు ఎన్‌ఐ సాంగ్లి, ఉపాధ్యాయురాలు పి.గాయత్రి కులకర్ణి, విద్యార్థులు పాల్గొన్నారు.