ముమ్మరంగా వేసవి వానలు
యశవంతపుర: పూర్వ ముంగారు వానలు రాష్ట్రంలో జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో సాధారణంగా వచ్చే వర్షం కంటే ఎక్కువ కురిసింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఆదివారం వరకు మామూలు కంటే 88 శాతం ఎక్కువ వర్షం పడింది. ఆదివారం రాత్రి, సోమవారం కూడా కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వాన పడింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కొనసాగవచ్చని వాతావారణ శాఖ తెలిపింది. విజయనగర జిల్లా హరప్పనహళ్లి తాలూకా ఉచ్చంగిదుర్గలో భారీ వర్షం నమోదైంది. మరోవైపు ఎండలు కూడా కొనసాగుతున్నాయి. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ తాపం మాడ్చేసింది. కరావళి, దక్షిణ ఒళనాడులో 34 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ ఎండలు కాశాయి.
శివమొగ్గ విమానం బెళగావికి
శివమొగ్గ: శివమొగ్గ నగరంలో కుండపోత వర్షం వల్ల విమానానికి ఆటంకం కలిగింది. ఆదివారం సాయంత్రం తిరుపతి నుంచి శివమొగ్గ విమానాశ్రయానికి వచ్చిన స్టార్‌ఎయిర్‌లైన్స్ విమానం వర్షం వల్ల ల్యాండ్ కాలేకపోయింది. బెళగావి విమానాశ్రయంలో దిగింది. దీంతో 291 కిలోమీటర్ల నుంచి ప్రయాణికులు మళ్లీ శివమొగ్గకు రోడ్డు, రైలు మార్గంలో వెళ్లారు.
సాధారణం కంటే అధిక వర్షం


