ప్రియురాలి తల్లి కోసం చోరీలు! | Choreographer Arrested For Stealing Valuables To Help His Girlfriend Mother Medical Treatment In Bangalore | Sakshi
Sakshi News home page

ప్రియురాలి తల్లి కోసం చోరీలు!

Nov 12 2024 12:33 AM | Updated on Nov 12 2024 1:38 PM

Choreographer Arrested For Stealing Valuables To Help His Girlfriend Mother Medical Treatment  In Bangalore

బొమ్మనహళ్లి: ప్రియురాలి తల్లికి వైద్య ఖర్చుల కోసం ప్రియుడు చోరీలకు, చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతూ ఖాకీలకు దొరికాడు. ఈ సంఘటన బెంగళూరుఽ దక్షిణలోని జిగణి పరిధిలో జరిగింది. గదగ్‌ జిల్లాలోని లక్ష్మేశ్వర్‌ తాలూకాలోని మల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్‌ అలీ బాలాసాహెబ్‌ నదాఫ్‌ (25) నిందితుడు. ఇతడు డ్యాన్స్‌ మాస్టర్‌గా పనిచేసేవాడు. నదాఫ్‌ ప్రియురాలి తల్లికి గుండె జబ్బు ఉంది. ఆమె వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. 

దీంతో ప్రియురాలి అభ్యర్థన మేరకు నదాఫ్‌ డబ్బు కోసం దొంగతనాలు మొదలు పెట్టాడు. ఆగస్టులో జిగణిలో రత్నమ్మ అనే మహిళ నడిచి వెళ్తుండగా బుల్లెట్‌ బైక్‌లో వచ్చి గొలుసును లాక్కెళ్లాడు. మరో మహిళ మెడలో తాళి బొట్టును ఎత్తుకెళ్లాడు. ఈ చోరీలు సీసీ కెమెరాలలో రికార్డు కాగా, జిగణి పోలీసులు విచారణ జరిపి వీర ప్రేమికున్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 8 లక్షల విలువ చేసే 3 బంగారం చైన్లు, 2 బైకులు, ఒక మొబైల్‌ ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement