మాదేశ్వర బెట్టపై భక్త సాగరం | - | Sakshi
Sakshi News home page

మాదేశ్వర బెట్టపై భక్త సాగరం

Feb 19 2026 10:15 AM | Updated on Feb 19 2026 10:15 AM

మాదేశ్వర బెట్టపై భక్త సాగరం

మాదేశ్వర బెట్టపై భక్త సాగరం

మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని ప్రసిద్ధ మలేమహదేశ్వర బెట్ట దేవస్థానంలో మహాశివరాత్రి జాతరలో భాగంగా బుధవారం మహారథోత్సవం నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. శాంత మల్లికార్జున స్వామి, ఆలయ ప్రాధికార కార్యదర్శి ఏఈ రఘు, అర్చకులు, లక్షలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవాన్ని ప్రారంభించారు. తేరును వివిధ రకాల పుష్పాలు, తోరణాలతో రంగులమయంగా తీర్చిదిద్దారు. గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఏనుగు ఉత్సవం జరిపారు. తరువాత మేళతాళాలతో ఉత్సవ విగ్రహాన్ని తేరులో ఆసీనుల్ని చేశారు. పూజా కై ంకర్యాలు ముగించి తేరు ఉత్సవాన్ని ప్రారంభించారు. తమిళనాడు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ఈ రథోత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు. బెట్ట మొత్తం భక్తసాగరమైంది.

వైభవంగా బ్రహ్మ రథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement