శివమొగ్గ జిల్లాలో దురాగతం.. యువతిపై లైంగికదాడి | - | Sakshi
Sakshi News home page

శివమొగ్గ జిల్లాలో దురాగతం.. యువతిపై లైంగికదాడి

Jul 5 2024 12:30 AM | Updated on Jul 5 2024 1:46 PM

-

మృగాళ్ల చెరలో యువతి..

శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మృగాళ్లు ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. గాజనూరు జలాశయం వద్ద మంగళవారం సాయంత్రం ఇద్దరు యువకులతో కలిసి వచ్చిన యువతిని నలుగురు దుండగులు కిడ్నాప్‌ చేసి మూకుమ్మడి అత్యాచారానికి పాల్పడ్డారు.

వివరాలు.. ఓ యువకుడు తన ప్రియురాలు, మరో మిత్రునితో కలిసి గాజనూరు జలాశయానికి వచ్చారు. ఈ సమయంలో నలుగురు యువకులు వారిపై దాడి చేసి కొట్టి యువతిని బెదిరించి కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. సమీపంలో ఉన్న తోటలో ఆమైపె నలుగురూ లైంగిక దాడికి ఒడిగట్టారు. ఆమె ప్రియుడు, మరో యువకుడు వెళ్లి స్థానిక తుంగానగర పోలీసులకు తెలియజేయగా గాలింపు చేపట్టారు.

ఒకటిన్నర రోజు తరువాత..
బుధవారం అంతా గాలించినా యువతి, దుండగుల జాడ దొరకలేదు. చివరకు గురువారం ఉదయం సమీపంలోని తోటలో యువతి అపస్మారక స్థితిలో కనిపించగా ఆమె శివమొగ్గలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వినాయక, అబి, మంజు, కౌశిక్‌, అనే నలుగురు అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. గాజనూరులోని ఒక ఇంటిలో నలుగురు కామాంధులు ఉన్నట్లు తెలిసి పోలీసులు దాడి చేశారు. అభి, మంజును అరెస్టు చేయగా మరో ఇద్దరు పారిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement