లిఫ్ట్‌లో బాలికకు లైంగిక వేధింపులు | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌లో బాలికకు లైంగిక వేధింపులు

Published Mon, Jun 26 2023 7:02 AM

- - Sakshi

బనశంకరి: ఫుడ్‌ డెలివరీ బాయ్‌ లిఫ్ట్‌లో ఓ బాలికను లైంగికంగా వేధించాడు. ఈఘటన తలఘట్టపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. చేతన్‌ అనే ఫుడ్‌ డెలివరీ బాయ్‌ ఈనెల 21న తలఘట్టపురలోని ఒక అపార్టుమెంటులోని మూడో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్‌లోకి వెళ్లాడు. 13వ అంతస్తుకు చెందిన ఒక బాలిక ట్యూషన్‌కు వెళ్లేందుకు ఇదే లిఫ్ట్‌లో ఎక్కింది. ఈ సమయంలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

లిఫ్ట్‌నుంచి బయటికి వచ్చిన బాలిక ట్యూషన్‌ టీచర్‌కు విషయం తెలిపింది. ఆమె బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా సెక్యూరిటీ సిబ్బంది చేతన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టంకింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement