రాజన్న క్షేత్రంలో వేద పరీక్ష | - | Sakshi
Sakshi News home page

రాజన్న క్షేత్రంలో వేద పరీక్ష

Jul 23 2026 1:42 AM | Updated on Jul 23 2026 1:42 AM

వేద శాఖలు ఇవే..

● తొలిసారిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ

● వాల్యుయేషన్‌.. కంప్యూటర్‌ డిజిటలైజేషన్‌

● సర్టిఫికెట్ల ప్రదానం

వేములవాడ: దక్షిణకాశీలోని రాజరాజేశ్వరసన్నిధిలో జాతీయస్థాయి వేద పరీక్షలు నిర్వహిస్తున్నారు. అఖిల భారత వేద శాస్త్ర స్మార్త ఆగమ విద్వత్‌ సదస్సు ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ, ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఈనెల 21 నుంచి 25 వరకు జరుగుతున్న ఈ పరీక్షల్లో 4 వేదాలు, 11 శాఖలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. మొత్తం 170 మంది ఈ పరీక్షల్లో పాల్గొంటుండగా.. 147 మంది విద్యార్థులు, 35 మంది పరీక్షాధికారులు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేద విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, బిహార్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలకు చెందిన పరీక్షాధికారులు విధులు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్‌ ఆధారిత వ్యవస్థ ద్వారా పారదర్శకంగా మార్కులు కేటాయిస్తారు. ఈనెల 25న ఫలితాలు ప్రకటించి, ఉత్తీర్ణులైన వారికి ‘జయపత్రిక’ (సర్టిఫికెట్‌) అందజేస్తారు. ఈ సర్టిఫికెట్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండడం విశేషం.

రుగ్వేదం, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం(కాణ్వశాఖ, మాధ్యందిన శాఖ), కృష్ణ యజుర్వేదం – మైత్రాయణి శాఖ,

సామవేదం(కౌథుమ,రాణాయణి శాఖ), సామవేదం – జైమినీయ శాఖ, అధర్వవేదం (శౌనక,పైప్పలాద శాఖ), స్మార్తం (అశ్వలా యన, ఆపస్తంబ సూత్రాలు), వేద అంత్యాక్షరి నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement