వేములవాడ/వేములవాడరూరల్: తెలంగాణ జానపద కళారూపం ఒగ్గుకథ ఖండాంతరాలు దాటనుంది. ఒగ్గుకథా సామ్రాట్ దివంగత మిద్దె రాములు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన మనుమడు మిద్దె వినీత్, తండ్రి పరశురాములుతో కలిసి అమెరికాలో ప్రదర్శన ఇవ్వనున్నారు. శ్రీసిలికానాంధ్రశ్రీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నట్లు వినీత్ బుధవారం తెలిపారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి అమెరికాకు బయలుదేరనున్నట్లు చెప్పారు. ఈనెల 31 నుంచి ఆగస్టు 1 వరకు అమెరికాలోని కాపిఫోర్నియా రాష్ట్రంలోని ఆక్లాండ్ ఏరినాలో నిర్వహించే వేడుకల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.
‘సిలికానాంధ్ర’ వేడుకల్లో మిద్దె వినీత్ ప్రదర్శన


