కరీంనగర్ టౌన్: నగరంలోని సుభాష్‌నగర్ ప్రభు త్వ పాఠశాలను అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, మధ్యాహ్న భోజన వంటగది, మంచినీటి ట్యాంకులు, ఆటస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల అభ్యాసనస్థాయిని పరిశీలిస్తూ రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. సాంఘికశాస్త్రంలో రాష్ట్రాలు రాజధానులు, ప్రధాన నదులు, భారతదేశం, తెలంగాణ పటా లను విద్యార్థులతో గీయించారు. డీఈవో ఎన్.ప్రశాంత్‌రెడ్డి, సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఆర్.రవీందర్ పాల్గొన్నారు.


