న్యూస్‌రీల్
పోస్టుల వివరాలు
ఎములాడ ఆలయంలో సిబ్బంది కొరత
320 రెగ్యులర్ పోస్టులకు విధుల్లో 185 మంది
ఇంకా భర్తీకాని 135 పోస్టులు
పెరుగుతున్న పనిభారం, వారాంతపు సెలవు గగనమే
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026
‘రాజన్న’కు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా పేరొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో సిబ్బంది కొర త పనిభారానికి కారణమవుతోంది. కనీసం వారాంతంలో సెలవు దొరికే అవకాశం కూడా కొన్నిసార్లు దక్కకపోవడం ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయంలో క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం మొత్తం 320 రెగ్యులర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 185 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాదాపు 135 పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతున్నట్లు తెలుస్తోంది. అర్చకుల విభాగంలోనే సుమారు 35 పోస్టులు ఖాళీగా ఉండగా, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (ఎల్‌జీఎస్) విభాగంలో దాదాపు 60 పోస్టులు భర్తీ కాలేదు. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ విభాగాల్లో 10 పోస్టులు, డ్రైవర్ విభాగంలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.
ఔట్ సోర్సింగ్‌లోనూ ఇదేతీరు
ఇక ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదని అంటున్నారు. మొత్తం 290 ఔట్‌సోర్సింగ్ పోస్టులకు గాను ప్రస్తుతం 250 మంది మాత్రమే పనిచేస్తుండగా, మరో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో భక్తులకు సేవలు అందించడమే కాకుండా, నిత్య కై ంకర్యాలు, పరిపాలనా కార్యక్రమాలను నిర్వహించడం సవాలుగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. మరోవైపు ఉద్యోగ విరమణ పొందిన ఒక ఏఈవోను అకౌంట్స్ అధికారిగా కొనసాగిస్తుండగా, సంవత్సరాలుగా ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం రెగ్యులరైజేషన్ లేదా పదోన్నతుల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సిబ్బంది కొరత కారణంగా ఉద్యోగులు వారానికి ఒక రోజు సెలవు కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొన్నదని, అనేక మంది నిరంతర విధుల వల్ల మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెలవులు మంజూరు చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ జీవితంపై కూడా ప్రభావితం పడుతోందని వారు పేర్కొంటున్నారు. రాజన్న ఆలయానికి రోజురోజుకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయకపోతే భవిష్యత్తులో ఆలయ సేవల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారులు వెంటనే స్పందించి ఖాళీల భర్తీపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత


