శాంతిర్యాలీ.. సంతాపం | - | Sakshi
Sakshi News home page

శాంతిర్యాలీ.. సంతాపం

Apr 25 2026 7:42 AM | Updated on Apr 25 2026 7:42 AM

శాంతిర్యాలీ.. సంతాపం ● మూడోరోజు కొనసాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ● మద్దతు తెలిపిన పలు సంఘాలు

కరీంనగర్‌టౌన్‌: తమ డిమాండ్లు పరిష్కరించాలని చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని డిపోల పరిధిలో శుక్రవారం కార్మికులు ఆందోళనను కొనసాగించా రు. సమ్మెకారణంగా ప్రయాణికులకు తిప్పలు త ప్పలేదు. ప్రైవేటు వాహనాల దోపిడీ యథావిధిగా కొనసాగింది. కరీంనగర్‌లోని ఒకటో డిపో ఎదుట కార్మికులు చేపట్టిన ధర్నాకు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బస్టాండ్‌ నుంచి అమరవీరుల స్తూపం వరకు శాంతిర్యాలీ నిర్వహించారు. డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌ మృతికి సంతాపం ప్రకటించారు. మే యర్‌ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల న్యాయపోరాటానికి బీజేపీ మద్దతుగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం తన మొండివైఖరిని వీడాలన్నారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాతంగి అశోక్‌ కార్మికులకు మద్దతు తెలిపారు. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 60వేల మంది తమ హక్కుల కోసం సమ్మె చేస్తుంటే, ప్రభుత్వం కనీసం స్పందించకుండా నలుగురు ఐఏఎస్‌ అధికారుల కమిటీ పేరుతో కాలయాపన చేయడం వంచించడమేనని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement