డంపింగ్‌ యార్డు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

డంపింగ్‌ యార్డు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

Apr 25 2026 7:42 AM | Updated on Apr 25 2026 7:42 AM

● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌లో డంపింగ్‌ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే కాంగ్రెస్‌ నాయకులను పట్టణంలో తిరగనీయమని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలో బీజేపీ మండల,పట్టణశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆఽందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. డంప్‌ యార్డు నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే కాంగ్రెస్‌ నేతల ఇళ్ల ఎదుట చెత్త కుప్పలు, చనిపోయి కుళ్లిపోయిన జంతువుల కళేబరాలను వదిలేస్తామన్నారు. దుర్గంధం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థిమయ్యేలా చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లను కలిసి ఫిర్యాదు చేస్తామని, గవర్నర్‌ను కలిసి సమస్య తీవ్రత వివరిస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పట్టణ, మండల అ ధ్యక్షులు తూర్పటి రాజు, పారుపల్లి కొండాల్‌రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మలారెడ్డి, నాయకులు మాడ వెంకట్‌రెడ్డి, పుప్పాల రఘు, నర్సింహరాజు, రాజు, రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement