కరీంనగర్ అర్బన్: ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాస్థాయి ఇసుక సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సీపీ గౌస్ ఆలంతో కలిసి నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్‌శాఖ అధికారులు సంయుక్తంగా ఇసుక రీచ్ లను తరచూ తనిఖీ చేయాలని పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ బృందాలు ఇసుక స్టాక్ యార్డులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా నిరంతరం ప్రత్యేక నిఘా పెడుతున్నామని వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా విషయమై 400 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవోలు కే.మహేశ్వర్, రమేశ్‌బాబు, మైనింగ్‌శాఖ ఏడీ రాఘవరెడ్డి, జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీకాంత్ చక్రవర్తి, టీజీఎండీసీ పీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
సమాచార నమోదు ప్రతీ ఒక్కరి బాధ్యత
సమాచార నమోదు ప్రతీ ఒక్కరి బాధ్యతని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ‘మన జనాభా గణన– మన అభివృది’ నినాదంతో జనాభా గణన 2027కు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన ఫ్లెక్సీలను శుక్రవారం ఆవిష్కరించారు.


