మల్యాల(చొప్పదండి): కొండగట్టు ఆంజనేయస్వామికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ సతీమణి మనాలి రూ.1.38లక్షల విలువైన గద బహూకరించారు. శుక్రవారం ఆంజనేయస్వామిని దర్శించుకుని 453గ్రాముల వెండి గద అధికారులకు అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకుడు చిరంజీవస్వామి, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, చెక్కిళ్ల అశోక్ పాల్గొన్నారు.
‘మా భూమి మాకు ఇప్పించండి’
గోదావరిఖని: కబ్జాకోరుల నుంచి రక్షించి త మ భూమి తమకు ఇప్పించాలని పెద్దపల్లి జి ల్లా గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లికి చెందిన ముప్పులక్ష్మి–ఐలయ్య దంపతులు కోరారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.1983 లో గోదావరిఖని అడ్డగుంటపల్లి సర్వే నంబర్ 666 లో 240 గజాల భూమిని తన పేరున కొనుగోలు చేశామన్నారు. భూమి ఖాళీగా ఉండడంతో కొంతమంది కలిసి నకిలీ దస్తావేజులు సృష్టించి అందులో షెడ్డు వేసుకున్నారని ఆరోపించారు. ఆ భూమిపై 1983 నుంచి లింక్ డాక్యుమెంట్‌లతో సహా అన్నిఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. వారిలో దళితులు ఉండడంతో భూమి వద్దకు వచ్చి గొడవ చేస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన చెందారు. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకుని తమ న్యాయం చేయాలని దంపతులు కోరారు.
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ గ్రామానికి చెందిన బొల్లె సిద్దార్థను (18) గుర్తుతెలి యని వాహనం ఢీకొని మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చల్‌గల్‌కు చెందిన బొల్లె సిద్దార్థ, మదన్, మసీదు వెంకటేశ్ గురువారం రాత్రి గ్రామ శివారులోని మ్యాంగో మార్కెట్‌లో కూలీ పని కోసం వెళ్లారు. పని ముగించుకుని శుక్రవారం వేకువజామున 3.30 గంటల సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా జగిత్యాల–నిజామాబాద్ ప్రధాన రహదారిపై చల్‌గల్ సబ్‌స్టేషన్ వద్ద వెనక నుంచి వాహనం ఢీకొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సిద్దార్థను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తండ్రి గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. కాగా, ప్రమాదానికి గురైన వాహనాన్ని గుర్తించేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సిద్దార్థ మృతితో చల్‌గల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడి సోదరుడు దుబాయ్‌లో ఉండటంతో శనివారం ఉదయం అతను రాగానే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


