కోరుట్ల: పదమూడేళ్లు నిండలే దు.. రెండు కిడ్నీల్లో వాపులు వ చ్చి దెబ్బతిన్నాయి.. ట్రీట్‌మెంట్ కోసం రూ. లక్షల్లో ఖర్చు చేయాల్సిన దుస్థితి. ఆ పేద కుటుంబంపై పెనుభారం పడింది. బాబు బాగు కోసం ఆ తల్లిదండ్రులు ప డుతున్న వ్యథ అంతాఇంతా కాదు. కోరుట్లలోని ఏసికోని గుట్టలో నివాసముండే శ్రీనివాస్–మానస దంపతుల కుమారుడు వాసు. ఏడాది నుంచి కిడ్నీ వాపులతో ఆరోగ్యం క్షీణించగా చికిత్స కోసం జగి త్యాల, కరీంనగర్ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించారు. చిన్నవయసులోనే రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని తేలిపోయింది. అసలే రోజువారీ కూలీనాలి చేసుకుని పొట్టగడుపుకునే ఆ కుటుంబం..ఉన్న బంగారం అమ్ముకుని రూ. 3 లక్షల దాకా అప్పు చేసి చి కిత్స కోసం నిమ్స్‌కు వెళ్లారు. దాదాపు నాలుగు నెలలుగా చికిత్స అందుతున్నాఅదనపు ఖర్చులు భా రంగా మారాయి. చేతిలో చిల్లిగవ్వ లేని దయనీయ పరిస్థితిలో తమ బాబును దక్కించుకోవడానికి శ్రీనివాస్ దంపతులు లెక్కలేని తిప్పలు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, దాతలు తమను ఆర్థికంగా ఆదుకుని బాబును కాపాడుకోవడానికి ఆసరా ఇవ్వాలని ఆ దంపతులు వేడుకుంటున్నారు.
రెండు కిడ్నీలు ఫెయిల్
నాలుగు నెలలుగా నిమ్స్‌లో చికిత్స
పేద కుటుంబంలో పెను చిచ్చు
అపన్నహస్తం కోసం ఎదురుచూపులు


