నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం

Apr 25 2026 7:42 AM | Updated on Apr 25 2026 7:42 AM

రాయికల్‌(జగిత్యాల): నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించడమే జీఎంఆర్‌ వరలక్ష్మీ ఫౌండేషన్‌ ధ్యేయమని మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు అన్నారు. రాయికల్‌ పట్టణంలోని జీఎంఆర్‌ వరలక్ష్మీ ఫౌండేషన్‌, జీఆర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌, ప్రతిమ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శిక్షణపొందిన వారికి శుక్రవారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, నిరుద్యోగులు తమ కుటుంబాలను పోషించుకునేందు కు శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. ఇలాంటి ట్రస్ట్‌లకు పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు సేవలందించాలని పేర్కొన్నారు. యువత మాత్రం మాదక ద్రవ్యాలకు బానిసలై భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, రాయికల్‌ మండలం బోర్నపల్లి, జగన్నాథపూర్‌ బ్రిడ్జి నిర్మాణం కో సం తాను, ఎంపీ ధర్మపురి అరవింద్‌ కేంద్ర మంత్రి ని కలిశామని, నిధుల మంజూరుకు విద్యాసాగర్‌రా వు కృషి చేయాలని కోరారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంతీయ ప్రచారక్‌ లింగం శ్రీధర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కట్కం రవీందర్‌, కౌన్సిలర్‌ రాకేశ్‌నాయక్‌, జీఎంఆర్‌ ప్రో గ్రాం ఆఫీసర్‌ మహేశ్‌, జీఆర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఇన్‌చార్జి ముత్యం రాజిరెడ్డి, ప్రతిమ ఫౌండేషన్‌ ప్రో గ్రాం మేనేజర్‌ గీతరెడ్డి, మార్కెటింగ్‌ మేనేజర్‌ కౌశి క్‌, ఆర్గనైజర్లు రఘుపతి, విజయ, శ్యామల, సిబ్బంది ప్రమోద్‌, నాగేందర్‌, చిరంజీవి పాల్గొన్నారు.

మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement