యాసంగి సీజన్‌లో తొమ్మిదిన్నర ఎకరాల మేర వరి సాగుచేసిన. వరి ఈనే సమయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో ఎల్లంపల్లి నీరు విడిచారు. ఆరున్నర ఎకరాలు వరికోసిన. సుమారు 210 క్వింటాళ్ల మేర దిగుబడి వచ్చింది. ఇంకా మూడెకరాలు వరి కోయాల్సి ఉంది.
– నిమ్మ చెంద్రారెడ్డి, దేశాయిపల్లి
విలాసాగర్‌లో వరద కాలువ నీరు ఆధారంగా యాసంగి సీజన్‌లో 8 ఎకరాల మేర వరి పంట సాగు చేశాను. కాలువ నుంచి చేలోకి కిలోమీటర్ మేర పైపులైన్ వేసుకున్నాను. మోటారు అమర్చుకుని పంటలకు నీరు అందిస్తాను. గతేడాది వానాకాలం సీజన్‌లో వరి పంట సాగు చేశాను.
– గంగాధర కనకయ్య, విలాసాగర్
వరదకాలువ మెట్ట ప్రాంత రైతులకు వరప్రదాయినిగా మారింది. యాసంగి పంటలు కాపాడేందకు సరైన సమయంలో ఎల్లంపల్లి నీరు విడుదల చేయించడం జరిగింది. జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో వానాకాలం, యాసంగి సీజన్లలలో రెండు పంటలు సాగు చేస్తున్నారు. ఈఎండాకాలంలో సైతం వరదకాలువలో నీరు నిల్వ ఉంది.
– మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే, చొప్పదండి


