జగిత్యాలరూరల్: ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా నిర్మాణానికి పంచాయతీ సెక్రటరీ అనుమతులు ఇవ్వడం లేదని సారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామంలో శుక్రవారం రేగుంట గంగు ఆందోళన చేపట్టింది. బాధితురాలు తెలిపిన వివరాలు.. రేగుంట గంగుకు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణం చేసుకునేందుకు సిద్ధం కాగా, గ్రామానికి చెందిన కొంత మంది ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వొద్దని పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో కావాలనే పంచాయతీ కార్యదర్శి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదని రేగుంట గంగు, పంచాయతీ కార్యదర్శికి డబ్బు ఇచ్చేందుకు రాగా నిరాకరిస్తూ వెళ్లిపోయాడు. ఈ విషయంపై సారంగాపూర్ ఎంపీడీవో సలీంను వివరణ కోరగా, ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు నిర్మించే భూమిపై వివాదం కొనసాగుతుందని, సెక్రటరీ డబ్బులు అడగలేదని పేర్కొన్నారు.
సెక్రటరీకి రూ.50 వేలు ఇచ్చేందుకు డబ్బుతో వచ్చిన మహిళ
నాగునూర్ పంచాయతీ వద్ద ఆందోళన


