వణికిస్తున్న గ్రామ సింహాలు వీధి కుక్కల స్వైర విహారం కాలినడకన.. బైక్‌లపై వెళ్లినా దాడి మూడేళ్లలో 10,390 కుక్కకాటు కేసులు వేసవిలో చెలరేగుతున్న శునకాలు
కరిచినచోట తొలుత సబ్బుతో శుభ్రం చేసి ఆస్పత్రికి తరలించాలి.
గాయం తీవ్రతను బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు.
పెంపుడు కుక్కలు కరిస్తే ఇదివరకే టీకా వేయించారా?లేదా అనే విషయాలు పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు.
వీధికుక్కలు కరిస్తే కరిచిన భాగాలను బట్టి తప్పనిసరిగా ఇమ్యునోగ్లోబిన్, వ్యాక్సినేషన్ ఇచ్చి చికిత్స కొనసాగిస్తారు.
చిన్నారులు, వృద్ధులు వీటిబారిన పడే ఆస్కారం మరింత ఎక్కువ. బయటికి వెళ్లే తరుణంలో కర్రను తీసుకెళ్లడం ఉత్తమం.
కుక్కల ప్రవర్తనలో తేడా కనిపించినా, వాటి నోటినుంచి నురగలాంటిది వెలువడినా పిచ్చికుక్కగా గుర్తించి మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలి.
కుక్క కరవగానే వీలైనంత త్వరగా గాయమైన భాగాన్ని 15 నిమిషాల పాటు కడిగి శుభ్రం చేయాలి. గాయానికి ఎలాంటి కట్టు కట్టకూడదు.
కుక్క కాటుతో రేబిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. బాధితులు వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఏఆర్‌వీ వ్యాక్సిన్ 1,3,7,14 రోజుల్లో డోస్ చొప్పున క్రమం తప్పకుండా తీసుకోవాలి.
కరీంనగర్: కుక్కల తాకిడికి ప్రజానీకం బెంబేలెత్తిపోతున్నారు. వీధివీధినా గుంపులుగా తిరుగుతున్న కుక్కలు కాలికనడకన.. బైక్‌పై వెళ్లినా వెంటబడి దాడి చేస్తున్నాయి. వేసవిలో వేడిని తట్టుకోలేక విపరీత ధోరణి ప్రదర్శిస్తూ ప్రజలను హైరా నా పెడుతున్నాయి. వేడితో పాటు ఆహారం, నీటి లభ్యత తగ్గడంతో అగ్రెసివ్‌గా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి కుక్కల వద్దకు వెళ్లగానే ఒక్కసారిగా దాడి చేస్తున్నాయి. ఈ ఏడాది కుక్కల సంఖ్యతో పాటు వాటి బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒ క్క కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నమోదైన కుక్కకాటు కేసులు 5,565 ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య రెట్టింపవగా జనాలు భయాందోళనకు గురవుతున్నారు.
పెరిగిన సంతానోత్పత్తి..
ఇటీవల వీధికుక్కలు విపరీతమైన సంతా నోత్పత్తి పెంచుకున్న వ్యవహారం వీధుల్లో కనిపిస్తోంది. గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా ఏ వీధిలో చూసినా పిల్లలతో దర్శనమివ్వడం, పిల్లలను కాపాడుకునేందుకు అవి క్రూరంగా వ్యవహరించడం కనిపిస్తోంది.
అత్యధిక ఉష్ణోగ్రతలతో..
జిల్లాలో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుక్కల్లో విపరీతమైన ఇరిటేషన్ వచ్చి, దాహం ఎక్కువై స్వైరవిహారం చేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆగ్రహంతో ఎవరు కనిపించినా దాడి చేసేందుకు యత్నిస్తున్నాయి. సరైన సమయంలో ఆహారం, నీళ్లు దొరక్క ఇలా వ్యవహరిస్తున్నాయి. ప్రధానంగా పిల్లలపై అధికంగా ప్రతాపం చూపుతున్నాయి.
మాంసాహారానికి అలవాటు పడి..
జీవవ్యర్థాలు, వృథా ఆహారం ఎక్కువగా లభించే ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా ఉంది. ఫంక్షన్‌హాల్స్, మటన్, చికెన్ షాపుల వద్ద వ్యర్థాలను తినేందుకు అలవాటు పడ్డాయి. అక్కడ ఆహారం లభించనప్పుడు జనావాసాల వైపు తరలివస్తున్నాయి. ఆ సమయంలో చేతిలో సంచితో వెళ్లే ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. వాటిని ప్రతిఘంటించలేక అనేకమంది తీవ్రంగా గాయపడుతున్నారు. అది ప్రాణాలు కోల్పోయే వరకు వస్తుంది. మాంసానికి అలవాటు పడిన కుక్కలు గ్రామాల్లో మేకలు, గొర్రెల మందలపై కూడా దాడులు చేసి వాటిని పీక్కు తింటున్నాయి.
మూడేళ్లలో 10,390 కేసులు
జిల్లాలో కుక్కకాటు బాధితుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. మూడేళ్లలో 10,390 కేసులు కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలోనే నమోదు కావడం వాటి దాడుల తీరుకు అద్దం పడుతుంది. ఇంకా పీహెచ్‌సీలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందినవారి సంఖ్య మరో 10 వేలకు పైగా ఉంటుందని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఆదేశాలు బుట్టదాఖలు
వీధి కుక్కల బెడద నివారణకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జిల్లాలో మాత్రం ఆ దిశగా ఒక్క అడుగు పడలేదు. స్టెరిలైజేషన్ (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్లు చేపట్టిన దాఖలాలు లేవు. కుక్కలను సంక్షణ కేంద్రాలకు తరలించడంలో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కుక్కకరిస్తే వెంటనే ఏం చేయాలి?
స్థానిక సంస్థలు స్పందిస్తేనే
వీధికుక్కలను అరికట్టడానికి శాసీ్త్రయ పద్ధతిలో ఏనిమల్ బర్త్ కంట్రోల్ శస్త్ర చికిత్సలు చేయడమే ఏకై క మార్గం. ఈ ప్రక్రియలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పాత్రే కీలకం. నిబంధనల ప్రకారం ముందుగా స్థానిక సంస్థలు ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను నియమించాలి. ఆయా కమిటీల ఆధ్వర్యంలో సిబ్బ ందితో కుక్కలను పట్టుకొని పశుసంవర్ధక శాఖకు అప్పగించాలి. వాటికి పశువైద్యాధికారులు శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారు. ఇందుకు బల్దియాలు, పంచాయతీలు నడుం బిగించాలి.
మూడేళ్లలో ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో కుక్కకాటు బాధితుల వివరాలు
నెల 2023–24 2024–25 2025–26
ఏప్రిల్ 192 205 315
మే 114 207 316
జూన్ 154 232 238
జూలై 194 196 361
ఆగస్టు 158 192 252
సెప్టెంబర్ 164 175 307
అక్టోబర్ 175 221 481
నవంబర్ 210 233 1,295
డిసెంబర్ 193 221 585
జనవరి 229 250 467
ఫిబ్రవరి 165 217 475
మార్చి 265 263 473
మొత్తం 2,213 2,612 5,565


