● కలెక్టర్ చిత్రామిశ్రా
కరీంనగర్ టౌన్: శ్రీ సగర భగీరథ మహర్షి పట్టుదల, సంకల్పం నేటి తరానికి ఆదర్శమని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. భగీరథ మహర్షి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రభుత్వం తరఫున అందించే విద్య, స్కాలర్‌షిప్, విద్యాలయాల్లో సీట్లు, అందించే రుణాలపై సగర సంఘం నాయకులకు అవగాహన కల్పించాలని బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఆర్డీవో మహేశ్వర్, వివిధశాఖల ఉన్నతాధికారులు, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవుని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కట్ట రాజు, కోశాధికారి కుమారస్వామి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కానుగంటి శ్రీనివాస్, రాష్ట్ర కార్యనిర్వహక సభ్యులు పాల్గొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్
కరీంనగర్ అర్బన్: జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా డి.శ్రీనివాస్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన లక్ష్మికిరణ్ సిద్దిపేటకు బదిలీ కాగా ఇన్‌చచార్జి అదనపు కలెక్టర్‌గా కరీంనగర్ ఆర్డీవో కె.మహేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. శ్రీనివాస్‌రెడ్డికి ఆర్డీవో కె.మహేశ్వర్, కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్, సూపరింటెండెంట్లు రాజేశ్, మాధవి, మడిపల్లి కాళిచరణ్, నేరేళ్ల కిషన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్‌యూను అన్ని రంగాల్లో ముందుంచుతాం
కరీంనగర్ సిటీ: శాతవాహన విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాల్లో ముందువరుసలో ఉంచుతామని వీసీ ఉమేశ్ కుమార్ తెలిపారు. గవర్నర్, విశ్వవిద్యాలయాల చాన్స్‌లర్ శివ్ ప్రతాప్ శుక్లాను గురువారం హైదరాబాద్‌లో కలిశారు. శాతవాహన విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి ప్ర యత్నం చేస్తున్నామని తెలిపారు. వర్సిటీ సిబ్బందికి, విద్యార్థులకు ముఖ బయోమెట్రిక్ అమలు చేస్తున్నామని, అన్ని కళాశాలలకు డిజిటల్ తరగతి గదులు, మిషన్ భగీరథ పైప్ లైన్ సాయంతో 24గంటల పాటు నీటి సదుపాయం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.


