రాష్ట్ర పండుగగా వాసవీ మాత జయంతి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర పండుగగా వాసవీ మాత జయంతి

Apr 24 2026 6:02 AM | Updated on Apr 24 2026 6:02 AM

విద్యానగర్‌(కరీంనగర్‌): వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున ఆర్యవైశ్యుల కులదేవత వాసవి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయిస్తూ శుక్రవారం జీవో విడుదల చేసింది. ఈనెల 26 వాసవీ మాత జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా వేడుకలు నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయం ప్రసిద్ధమైంది. ఈ ఆలయంలో ఏడు అంతస్తులతో ఉన్న గాలి గోపురం వివిధ వర్ణాలతో కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించడంతో తమ జన్మ ధన్యమైనదని ఆర్యవైశ్యు భక్తులు భావిస్తారు. అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ఆలయ ట్రస్ట్‌ వాసవీ దేవి గురువు శ్రీ భాస్కరాచార్య రచించిన మూల పురాణం ‘వైశ్య పురాణ కావ్యము’ ఆధారంగా, ఆమె 2617 (జూలియన్‌) సంవత్సరంలో జన్మించారు.

జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

26న వాసవీ మాత జయంతి

Advertisement
 
Advertisement
Advertisement