కరీంనగర్‌క్రైం: కరీంనగర్ కోర్టుకు కేసు విషయంలో వచ్చిన రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన సంతోశ్ గురువారం మధ్యాహ్నం 12గంటలకు స్పృహ తప్పిపడిపోయాడు. కరీంనగర్ కోర్టు సముదాయంలోని ఎకై ్సజ్ కోర్టుకు కేసు విషయంలో హాజరైన సంతోష్ ఒక్కసారిగా కిందపడిపోవడంతో అప్రమత్తమైన న్యాయవాదులు, పోలీసులు వైద్యుడికి సమాచారం ఇచ్చాఉ. వెంటనే వచ్చి అతడిని పరీక్షించారు. కోర్టు పోలీసులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
మృతురాలి మెడలోంచి బంగారం మాయం
● పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని ధరూర్ క్యాంప్‌లోగల ప్రభుత్వ క్రిటికల్ కేర్ ఆస్పత్రిలో మృతురాలి మెడలోంచి బంగారం మాయంకాగా.. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన వేల్పుల బాలవ్వ (84) అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం క్రిటికల్ కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం వేకువజామున 5గంటలకు మృతిచెందింది. మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకెళ్లగా.. చెవులకున్న పావుతులం బంగారం కనిపించలేదు. బాలవ్వ అల్లుడు గాండ్ర శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. రోగి వద్దనున్న బంగారం మాయం కావడంపై ఆస్పత్రిలో చర్చనీయాంశంగా మారింది.


