రాజన్న ఆలయ పనులపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

రాజన్న ఆలయ పనులపై సమీక్ష

Apr 24 2026 6:02 AM | Updated on Apr 24 2026 6:02 AM

వేములవాడ: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై హైదరాబాద్‌లో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ గురువారం సమీక్షించారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్‌, ఎండోమెంట్‌ కమిషనర్‌ హన్మంతరావు, వీటీఏడీఏ వైస్‌చైర్మన్‌ కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ హాజరయ్యారు. ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి, విస్తరణ పనులపై సవివరంగా చర్చించారు. ఇందులో భాగంగా ఈ దశలో చేయాల్సిన పనులను గుర్తించి సవివరంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అధికారులకు సూచించారు. మరోసారి శృంగేరిపీఠం జగద్గురువులు విధుశేఖర భారతిస్వామి వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ఆలయ ఈవో రమాదేవి, ఆర్‌అండ్‌బీ అధికారులు, ఆర్కిటెక్చర్‌, స్థపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement