సూరీడు సుర్రు.. మీటర్లు గిర్రు | - | Sakshi
Sakshi News home page

సూరీడు సుర్రు.. మీటర్లు గిర్రు

Apr 23 2026 7:54 AM | Updated on Apr 23 2026 7:54 AM

పెరిగిన ఉష్ణోగ్రతలు.. విద్యుత్‌ వినియోగం ౖపైపెకి.. పట్టణాల్లో పెరిగి.. పల్లెల్లో తగ్గిన విద్యుత్‌

కొత్తపల్లి(కరీంనగర్‌): నిప్పులు కక్కుతున్న సూర్యుడు.. భరించలేని ఎండ, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొద్దిసేపు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ పరికరాలు నడుస్తుండటంతో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. విద్యుత్‌ మీటర్లు గిరగిరా తిరుగుతూ విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుదలకు కారణమవుతోంది.

పట్టణాల్లో పెరిగి.. పల్లెల్లో తగ్గి..

పట్టణ ప్రాంతాల్లో ఎయిర్‌ కండీషనర్ల వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల విద్యుత్‌ డిమాండ్‌ మరింత పెరుగుతోంది. పల్లెల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో ఫ్రిడ్జ్‌లు, టీవీలు, కూలర్ల వంటి పరికరాల వినియోగిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ మోటార్ల వినియోగం లేక వినియోగం కొంతమేర తగ్గింది.

కొత్త టీడీఆర్‌ల ఏర్పాటు

వేసవిలో లో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా నిరంతరం సరఫరా చేయాలనే లక్ష్యంతో విద్యుత్‌ శాఖ కొత్త డీటీఆర్‌లను ఏర్పాటు చేసింది. కరీంనగర్‌టౌన్‌ (కరీంనగర్‌ నగరం–49) డివిజన్‌లో 115, కరీంనగర్‌రూరల్‌ డివిజన్‌లో 158, హుజురాబాద్‌లో 105 డీటీఆర్‌లను ఏర్పాటు చేసింది. అలాగే ఆకునూర్‌, బేతిగల్‌, గునుకులకొండాపూర్‌, చల్లూర్‌, బొమ్మకల్‌, ఎస్సారార్‌ కళాశాల, జంగపల్లిలో డీటీఆర్‌ల సామర్థ్యం పెంచారు.

రికార్డు వినియోగం..

కరీంనగర్‌ సర్కిల్‌ పరిధిలో ఈ నెల 11న రికార్డు వినియోగం నమోదైంది. జిల్లాకు 8.79 మిలియన్‌ యూనిట్ల కోటాకుగాను 12.68 మిలియన్‌ యూనిట్లు వినియోగించారు. ఎండ తీవ్రతతో గృహ, పరిశ్రమలతో పాటు వ్యవసాయ పంప్‌సెట్లు ఒకేసారి వినియోగించడంతో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే కొద్ది రోజులుగా కరీంనగర్‌ నగరంతో పాటు మున్సిపాలిటీల్లో విద్యుత్‌ వాడకం పెరిగి డీటీఆర్‌లపై లోడ్‌ పడుతోంది.

కరీంనగర్‌ జిల్లాలో..

విద్యుత్‌ సర్వీసులు 5,70,580

గృహ కనెక్షన్లు 3,92,330

వ్యవసాయ కనెక్షన్లు 1,33,344

జిల్లాలో విద్యుత్‌ వినియోగం ఇలా..

(మిలియన్‌ యూనిట్లలో)

తేదీ(ఏప్రిల్‌) 2025 2026

17 7.438 8.906

18 7.438 8.613

19 7.438 8.331

20 7.438 8.257

21 7.313 7.924

కరీంనగర్‌ నగరంలో..

తేది(ఏప్రిల్‌) 2025 2026

17 3.528 3.453

18 3.568 3.619

19 3.628 3.858

20 3.598 3.783

21 3.654 3.678

అంతరాయం లేకుండా విద్యుత్‌

ఎండల తీవ్రతతో గృహ వినియోగం పెరిగినా అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. ఓవర్‌లోడ్‌ సమస్యల నివారణకు 352 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, 14 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశాం. కొత్తగా 4 సబ్‌స్టేషన్లు ప్రారంభించగా, మరో 12 నిర్మాణ దశలో ఉన్నాయి. వినియోగదారులకు సమస్యలుంటే వాట్సప్‌ చాట్‌బాట్‌ నంబర్‌ 79016 28348, టోల్‌ ఫ్రీ 1912కు తెలియజేయాలి. – రాపెల్లి రవీందర్‌, ఎస్‌ఈ కరీంనగర్‌

Advertisement
 
Advertisement
Advertisement