కరీంనగర్‌కార్పొరేషన్: పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని సుడా కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఇప్పటికే చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సుడా కమర్షియల్ బిల్డింగ్ మొదటి విడత పనులు చివరి దశకు వచ్చాయని, అవి పూర్తి కాగానే, మిగతా పనులకు టెండర్లు పిలవాలన్నారు. రాజీవ్‌చౌక్‌లో నూతనంగా ఏర్పాటు చేయనున్న రాజీవ్‌గాంధీ కాంస్య విగ్రహాన్ని మే 21న ఆయన వర్ధంతి సందర్భంగా ప్రారంభించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరపాలక కమిషనర్, సుడా వైస్‌చైర్మన్ ప్రఫుల్ దేశాయ్, ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈ శివానంద్, డీఈలు రాజేంద్రప్రసాద్, వెంకటేశ్వర్లు, ఏఈలు పాల్గొన్నారు.
సకాలంలో ధాన్యం కొనాలి
కరీంనగర్‌రూరల్: రైతులకు ఇబ్బంది కలగకుండా సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సుడా చైర్మన్ కె.నరేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం కరీంనగర్ మండలం నగునూరు, ఎలబోతారం, చామనపల్లి, బహుదూర్‌ఖాన్‌పేట, దుబ్బపల్లి, చెర్లభూత్కూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సర్పంచులు సాయిల్ల శ్రావణి, బోగొండ ఐలయ్య, తప్పెట్ల రాజు, గుర్రం సంధ్యతిరుపతిరెడ్డి, మోతే ప్రశాంత్‌రెడ్డి, సుద్దాల కమలాకర్, ఉపసర్పంచులు పాల్గొన్నారు. దుర్శేడ్ సొసైటీ ఆధ్వర్యంలో మొగ్ధుంపూర్, చేగుర్తి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రత్యేక అధికారి శైలజతో కలిసి సర్పంచులు మాదాసు శీనమ్మ,బాషవేణి సరోజనమల్లేశం ప్రారంభించారు. ఉపసర్పంచులు, పంచాయతీకార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


