సత్తాచాటుతాం
గోదావరిఖని: అంతర్జాతీయ రెస్క్యూ పోటీలకు సింగరేణి సిద్ధమైంది. జాంబియా దేశంలో నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు ఈనెల 24 ఆ దేశానికి పయనమవుతోంది. మొత్తం ఆరుగురు సభ్యులు గల బృందానికి 45 రోజులుగా ఆర్జీ–2 ఏరియాలోని మెయిన్‌రెస్క్యూ స్టేషన్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కఠోర సాధనతో బ్రిగేడియర్లు శిక్షణ ముగించుకుని జాంబియాకు బయలుదేరి వెళ్లనున్నారు.
మే ఒకటి వరకు పోటీలు
14వ అంతర్జాతీయ మైన్ రెస్క్యూ పోటీలు (ఐఎంఆర్‌సీ) జాంబియాలో నిర్వహించనున్నారు. సింగరేణి బ్రిగేడియర్లు ఈనెల 25న అక్కడకు చేరుకుంటారు. ఈనెల 28 నుంచి మే ఒకటే తేదీ వరకు జరిగే పోటీల్లో పాల్గొంటారు. వివిధ దేశాల మైన్స్ రెస్క్యూ బృందాలు హాజరవుతాయి. ప్రతీరెండేళ్లకోసారి జరిగే ఐఎంఆర్‌సీ పోటీల్లో సింగరేణి రెండు దశాబ్దాలుగా పాల్గొంటూ వస్తోంది. ఆలిండియా రెస్క్యూ పోటీల్లో డబుల్ హాట్రిక్ సాధించి తనకంటూ ప్రత్యేక స్థానం నిలుపుకున్న సింగరేణి రెస్క్యూ.. గతంకన్నా ఈసారి భిన్నంగా పోటీలకు ముందస్తుగా ప్రాక్టీస్ పొంది అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటేందుకు తహతహలాడుతోంది.
సింగరేణిదే ఖర్చు..
రెస్క్య బ్రిగేడియర్లు విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చేవరకు సింగరేణి సంస్థ ఖర్చులు భరిస్తోంది. ప్రత్యేక యూనిఫాం, షూలు, ఇతర ఏర్పాట్లు చేసింది. జట్టు సభ్యులకు రెస్క్యూ రికవరీ, ఫైర్‌ఫైటింగ్, రోప్‌రెస్క్యూ, ఫస్ట్ ఎయిడ్, రెస్క్యూ స్కిల్స్ విభాగాల్లో ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు.
టీం సభ్యులు వీరే..
అంతర్జాతీ రెస్క్యూ పోటీలకు బయలుదేరి వెళ్లే సభ్యుల పేర్లను సింగరేణి ప్రకటించింది. కెప్టెన్‌గా ప్రమోద్‌కుమార్, బ్రీతింగ్ ఆఫీసర్‌గా నితిన్‌కుమార్, సభ్యులుగా శ్యాంకుమార్, శ్రీకాంత్, బానుప్రసాద్, రాకేశ్, టెక్నీషియన్‌గా సాయికృష్ణ, టెక్నికల్ ట్రాన్స్‌లేటర్‌గా రాజేందర్‌రెడ్డిని ప్రకటించారు.
షెడ్యూల్ ఇలా
ఈనెల 24న బయలు దేరివెళ్లడం
25న జాంబియాలో రిపోర్టింగ్
27న ఓరియెంటేషన్ పోగ్రాం
28న ఫెర్‌ఫైటింగ్ పోగ్రాం
29న రోప్‌రెస్క్యూ
మే 1న ఫస్ట్‌అండ్‌రెస్క్యూ
2న అండర్‌గ్రౌండ్ రెస్క్యూ
4న సిటీ విజిట్
5న పోటీల ముగింపు వేడుకలు
మే6 ఇండియాకు తిరిగి రావడం
రెస్క్యూ పోటీలకు బ్రిగేడియర్లు సిద్ధం
ఈనెల 24న జాంబియాకు పయనం
28 నుంచి మే ఒకటి వరకు పోటీలు
జాంబియాలో జరిగే అంతర్జాతీయ రెస్క్యూ పోటీల్లో పాల్గొనేందుకు సింగరేణి జట్టు సర్వసన్నద్ధమైంది. సభ్యులు పూర్తిస్థాయిలో తర్ఫీదు పొందారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సత్తా చాటుతాం.
– శ్రీనివాస్‌రెడ్డి, రెస్క్యూ జీఎం


