గోదావరిఖని: సింగరేణి ఓసీపీలోని డ్రాగ్‌లైన్(పృథ్వీభంజన్)కు విద్యుత్ సరఫరా చేసే కాపర్ కేబుల్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. 3 –కోర్ ఆర్మ్‌డ్ కాపర్‌కేబుల్‌పై కన్నేసిన దొంగలు.. కొన్నిరోజుల క్రితమే చోరీచేసినట్లు తెలుస్తోంది. డ్రాగ్‌లైన్ జీవితకాలం పూర్తికావడంతో ప్రాజెక్టు ఉపరితలంపైకి తీసుకొచ్చి అలాగే ఉంచారు. దానికి విద్యుత్ కేబుల్‌ను అలాగే ఉంచారు. దీనిపై కన్నేసిన దొంగలు.. సుమారు 250 మీటర్ల పొడవున కత్తిరించి తీసుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనివిలువ సుమారు 1.30కోట్లు ఉంటుంది కార్మికవర్గాలు చెబుతున్నాయి. రాగితీగ చోరీకి గురైన మాట వాస్తవమే అయినా.. విలువ అంతగా ఉండదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. పోలీసులు, సింగరేణి విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఇంటి దొంగల సహకారంతోనే చోరీ జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది.


