‘సాయ్‌’ పిలుస్తోంది | - | Sakshi
Sakshi News home page

‘సాయ్‌’ పిలుస్తోంది

Apr 23 2026 7:54 AM | Updated on Apr 23 2026 7:54 AM

డేటా విశ్లేషణ కీలకం

కరీంనగర్‌స్పోర్ట్స్‌: క్రీడా రంగానికి భారత క్రీడాప్రాధికారిక సంస్థ మార్గదర్శకంగా నిలుస్తుంది. పంజాబ్‌ రాష్ట్రం పటియాలలోని నేతాజీ సుభాష్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ యువ క్రీడాకారులకు సువర్ణావకాశాన్ని అందించింది. 2026–27 సంవత్సరంలో పలు కోర్సుల్లో శిక్షణకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. క్రీడలను వృత్తిగా తీసుకోవాలనుకునే యువతకు గొప్ప అవకాశం. కోర్సులు కేవలం శిక్షణకు మాత్రమే కాకుండా, శాసీ్త్రయ ధృక్పథంతో ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడనున్నాయి. కోర్సులు పూర్తి చేసిన క్రీడాకారులు దేశవ్యాప్తంగా కోచ్‌లుగా, ఫిట్‌నెస్‌ ట్రైనర్లు, అనలిస్ట్‌, క్రీడా సంస్థల్లో ఉన్నత స్థానాల్లో అవకాశాలు పొందవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా అవకాశాలు దొరుకుతాయి. క్రీడలపై ఆసక్తి ఉన్న యువత https:// www. dipsc. nsnis. in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా పలు కోర్సుల వివరాలతో కథనం.

కోర్సుల వివరాలు

42వ ఎంఎస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్‌ (2 ఏళ్లు), 64వ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ కోచింగ్‌, 5వ పీజీ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ పెర్ఫార్మెన్స్‌ అనాలిసిస్‌, 4వ పీజీ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ సైకాలజీ, 4వ పీజీ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌, 4వ పీజీ డిప్లొమా ఇన్‌ స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ (ఒక సంవత్సరం). కాగా 64వ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ కోచింగ్‌కు దరఖాస్తులు ఈ నెల 23 లోపు, మిగిలిన కోర్సులకు ఈ నెల 30 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సీట్లు ఇలా..

64వ డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ కోచింగ్‌ ఒక ఏడాది నిర్వహిస్తారు. 26 క్రీడాంశాల్లో 785 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆర్చరీ 30, అథ్లెటిక్స్‌ 75, బ్యాడ్మింటన్‌ 20, బ్యాడ్మింటన్‌ 20, బాస్కెట్‌బాల్‌ 30, బాక్సింగ్‌ 50, కానోయింగ్‌ కయాకింగ్‌ 15, సైక్లింగ్‌ 30, ఫెన్సింగ్‌ 30, ఫుట్‌బాల్‌ 50, జిమ్నాస్టిక్స్‌ 20, హ్యాండ్‌బాల్‌ 20, హాకీ 50, జూడో 30, కబడ్డీ 30, ఖోఖో 20, రోయింగ్‌ 10, షూటింగ్‌ 20, స్విమ్మింగ్‌ 20, టేబుల్‌ టెన్నిస్‌ 40, తైక్వాండో 20, టెన్నిస్‌ 20, వాలీబాల్‌ 30, వెయిట్‌లిఫ్టింగ్‌ 30, రెజ్లింగ్‌ 50, వుషూ 25, యోగాసన 20 సీట్లు ఉన్నాయి.

క్రీడల కోర్సుకు దరఖాస్తులు

ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌తో భరోసా

క్రీడలపై ఆసక్తి ఉన్నవారికి చాన్స్‌

42వ ఎంఎస్సీ స్పోర్ట్స్‌ కోచింగ్‌ క్రీడలివే..

అథ్లెటిక్స్‌, బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌, జిమ్నాస్టిక్స్‌, హాకీ, స్విమ్మింగ్‌, వాలీబాల్‌, వెయిట్‌ లిప్టింగ్‌,

రెజ్లింగ్‌.

ఆధునిక క్రీడల్లో డేటా విశ్లేషణ కీలకం. పెర్ఫార్మెన్స్‌ అనాలిసిస్‌ వంటి కోర్సులు చేయడం ద్వారా ప్రత్యర్థుల బలహీనతలను పసిగట్టే నైపుణ్యం లభిస్తుంది. ఇది క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతుంది. కోర్సులు పూర్తి చేసినవారు పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్‌ క్లబ్‌లలో ఫిట్‌నెస్‌ నిపుణులుగా స్థిరపడి, ఆరోగ్యవంతమైన క్రీడా సమాజాన్ని నిర్మించగలరు.

– నాగిరెడ్డి సిధారెడ్డి,

శాట్స్‌ అసిస్టెంట్‌ రిటైర్డ్‌ డైరెక్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement